ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చందరబాబునాయుడు శుక్రవారం ట్రీట్మెంట్ కోసం అమరావతి నుంచి హైదరాబాద్ కి వచ్చారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చందరబాబునాయుడు శుక్రవారం ట్రీట్మెంట్ కోసం అమరావతి నుంచి హైదరాబాద్ కి వచ్చారు. జనరల్ మెడికల్ చెకప్ కోసం ఆయన హైదరాబాద్ నగరంలోని ఏషియన్ గస్ట్రోలజీ హాస్పిటల్ కి వెళ్లారు.
గచ్చిబౌలి లోని ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌కి ఉదయం పరగడపునే బాబు వెళ్లారు. సుమారు గంటకు పైగా మెడికల్ చెకప్ జరిగిందని తెలుస్తోంది. కాగా.. చెకప్ అనంతరం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. బాబు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని టీడీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
ప్రస్తుతం సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతారని తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.