మెరిట్ సాదించిన విద్యర్ధులను చదివించే బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.పెదరికం ప్రతిభకు అడ్డురాదని, రాకూడనదని చెబుతూ విద్యార్థుల తల్లితండ్రులకు ఆయన ఈ హామీ ఇచ్చారు.టెన్త్, ఇంటర్, ఐఐటీ జేఈఈ పరీక్షలలో మెరిట్ కనబర్చిన విద్యార్ధుల తో, వారీ తల్లితండ్రులతొ ముఖ్యమంత్రి ముఖాముఖి
మెరిట్ సాదించిన విద్యర్ధులను చదివించే బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పెదరికం ప్రతిభకు అడ్డురాదని, రాకూడనదని చెబుతూ విద్యార్థుల తల్లితండ్రులకు ఆయన ఈ హామీ ఇచ్చారు.
టెన్త్, ఇంటర్, ఐఐటీ జేఈఈ లలో మెరిట్ కనబర్చిన విద్యార్ధులు, వారీ తల్లితండ్రులతొ ముఖ్యమంత్రి ముఖాముఖి జరిపారు.
టాప్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ లు , మెమోంట్స్ , లాప్ టాప్స్ చంద్రబాబు ఆంద చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన విశేషాలు:
‘మీరు ఇలాగే ర్యాంకులు సాధిస్తే ఎంతవరకయినా చదివిస్తాం, ఏ ఉన్నత విద్యను అభ్యసించినా ప్రభుత్వమే వ్యయం భరిస్తుంది,’ అని ఆయన భరోసా ఇచ్చారు.
గ్రామీణ ప్రాంత విద్యర్ధులు తమసత్తా చాటారు. ఎక్కడ చదివాము అని కాదు.... ఎంత. కష్టపడ్డాము అన్నది ముఖ్యం
విద్యార్ధులు ఏప్పుడు ఒటమిని అంగీకరించ కూడదు.
విద్యర్ధులలొ డబ్బుల సంపాదనకంటే సేవ చేయాలనే ఆలొచన ఎక్కువగా ఉంది.
చాలా మంది విద్యార్థులు ఐఏఎస్ చేసి సమాజానికి సేవ చేయాలనీ చెప్పడం నాకు సంతోషంగా ఉంది..
విద్యర్ధులను ప్రొత్సహించడం కొసం ప్రతిభ అవార్డ్ లు ప్రవేశపెట్టాం ..
రానున్న రొజుల్లో బాగా చదివి ర్యాంక్ లు సాధించిన విద్యార్ధులు ఉన్నత చదువుల కావాల్సిన సాయం అందించేందుకు ప్రత్యేకంగా జీఓ తీసుకోస్తాం.
మంచి ర్యాంకులు సాధించిన వారు ఇంటిలొ తల్లిదండ్రులపై అధారపడకుండా వారి చదువులకు కావాల్సిన ప్రోత్సహాన్ని ప్రభుత్వం ఇచ్చేలా కృషి చేస్తాం..
తెలంగాణ ఎంసెట్ లొ సైతం ఏపీ విద్యార్ధులు సత్తాచాటడం సంతోషం
రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతాం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక యూనివర్శిటీలు తీసుకొస్తున్నాం.
స్టాండర్డ్స్ లేని యూనివర్శిటిలు, కాలేజిలు ఉన్నాయి. వాటీపై చర్యలు తీసుకొవాలని అదేశాలు ఇచ్చాను
240 జూనియర్ కాలేజిలు స్టాండర్డ్ లేదు అని రద్దు చేశాము, మరొ 804 కాలేజీలకు నొటీసులు ఇచ్చాము
40 ఇంజనీరింగ్ కాలేజిలకు కూడా నోటీసులు ఇచ్చాం... స్టాండర్డ్స్ మెయింటైన్ చెయకపొతే చర్యలు తప్పవు
విద్యర్ధులతో మాట్లాడి వారు ఎమి చదువుకొవాలి అనుకుంటే ఆ చదువు అందుబాటులో కి తెచ్చేందుకు మార్గాలు అన్వేషించాలని అధికారులను చెబుతున్నాను.
