నేడు హైదరాబాద్ కు చంద్రబాబు.. వైద్యపరీక్షలు ఇక్కడే...
వైద్యపరీక్షల నిమిత్తం నేడు చంద్రబాబు హైదరాబాద్ కు రానున్నారు. ఇక్కడే ఆయన అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

అమరావతి : జైలు నుంచి మద్యంతరబైయిపై విడుదలైన చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాదుకు వెళ్ళనున్నారు. మద్యంతరబైయిలు నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాదులోనే చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఆయన ఎవరిని కలవరని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుకి అచ్చెంనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
53 రోజుల తర్వాత చంద్రబాబు బయటికి రావడం సంతోషకరమైన విషయమే అని... అయినా, కోర్టు ఆదేశాల మేరకు ఆయన ప్రస్తుతం ఎవరిని కలవరని ఈ విషయాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు గుర్తించి సహకరించాలని కోరారు. ‘చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబుకు బెయిల్ రావడం తెలుగు ప్రజలతో పాటు వివిధ దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరం ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామని అచ్చెంనాయుడు విజ్ఞప్తి చేశారు
రాజమండ్రి టు ఉండవల్లి : సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు..జననీరాజనాలు..
కాగా, మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మద్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని తన నివాసానికి బయలుదేరారు. ఈ ప్రయాణం సుదీర్ఘంగా కొనసాగింది. 14.30 గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. నిర్విరామంగా సాగిన సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబునాయుడు అలసిపోయారు.
చంద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్విగ్నానికి గురయ్యారు. జై చంద్రబాబునాయుడు, లాంగ్ లివ్ చంద్రన్న అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడు ఇంటివద్దకు అమరావతి రైతులు, మహిళలు భారీగా చేరుకున్నారు.
అమరావతి మహిళలు ఉండవల్లిలోని ఆయన నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పట్టారు.
అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. రాజమండ్రి జైలు వద్ద నుంచి నిన్న సాయంత్రం 4.15గంటలకు బయలుదేరిన టిడిపి అధినేత చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం చేశారు.
ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగడంపై చంద్రబాబు పోలీసులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించగా అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే జాప్యం జరుగుతోందని వారిని ఒత్తిడి చేస్తే శాంతిభద్రత సమస్య వస్తుందని పోలీసులు తెలిపారని సమాచారం.