Asianet News TeluguAsianet News Telugu

వచ్చే రెండు మూడు సీట్ల కోసం అప్పుడే బేరాలు మెుదలెట్టిన జగన్ : చంద్రబాబు ఫైర్

నిర్లక్ష్యం చెయ్యడం వల్ల నింద మోదీకే వచ్చిందని ఫలితంగా ఏపీలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటం రాష్ట్రం కోసం, వ్యవస్థల కోసం, దేశం కోసమని సమర్థించుకున్నారు. వైసీపీ పోరాటం స్వార్థం కోసమని, పదవుల కోసమంటూ ఎద్దేవా చేశారు. 

chandrababu slams pm modi, ys jagan
Author
Amaravathi, First Published May 4, 2019, 4:57 PM IST

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీతో రాజకీయవైరంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో మొదట్లోనే గొడవ పెట్టుకుంటే ఏపీ నష్టపోయేదని  అన్నారు. 

రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని అంశాల సాధన కోసం తాము ఓపికగా ఎదురు చూశామని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మోదీ ఏపీని నిర్లక్ష్యం చేశారని చెప్పుకొచ్చారు. 

నిర్లక్ష్యం చెయ్యడం వల్ల నింద మోదీకే వచ్చిందని ఫలితంగా ఏపీలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటం రాష్ట్రం కోసం, వ్యవస్థల కోసం, దేశం కోసమని సమర్థించుకున్నారు. వైసీపీ పోరాటం స్వార్థం కోసమని, పదవుల కోసమంటూ ఎద్దేవా చేశారు. 

కేసుల మాఫీ కోసమే వైఎస్ జగన్ మోదీతో రహస్య బంంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. వచ్చే రెండు, మూడు సీట్లకు జగన్‌ ఇప్పుడే బేరాలు ప్రారంభించారంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. 

ఈసారి ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో లేక మూడో లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ సీట్ల కోసమే ఇప్పటి నుంచే వైఎస్ జగన్ బేరసారాలు ప్రారంభించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎంతోమంది విలన్లను తట్టుకున్నా, తెలంగాణ ఎమ్మెల్యేల పరిస్థితి మాకు రాలేదు: చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios