నేనే నెంబర్ వన్ చేస్తా: కేంద్రానికి చంద్రబాబు సవాల్

Chandrababu says AP will be number one
Highlights

కేంద్రం హోదా ఇవ్వకున్నా, విభజన హామీలను అమలు చేయకున్నా రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

అమరావతి: కేంద్రం హోదా ఇవ్వకున్నా, విభజన హామీలను అమలు చేయకున్నా రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఓలింపిక్స్ నిర్వహించే స్థాయికి ఎదుగుతామని అన్నారు. ఓ వైపు కేంద్రంపై పోరాడుతూనే మరో వైపు అభివృద్ధి చేస్తామని అన్నారు. 

విజయవాడలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ చుట్టూ ఎల్బీనగర్, యూసఫ్ గూడ, మేడ్చల్‌లలో మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. 

తాను చూపిన చొరవతోనే గోపీచంద్ అకాడెమీ అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తోందని చెప్పారు. ఇవాళ ప్రఖ్యాత క్రికెటర్ అనిల్ కుంబ్లే సహకారంతో ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్ గాండీవ ద్వారా అత్యుత్తమ క్రీడాకారులను దేశానికి అందిస్తామని అన్నారు.. క్రీడాప్రాంగణంలో ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.

 రాజకీయ నేతలకు రాష్ట్ర, దేశస్థాయిలో మాత్రమే గుర్తింపు వస్తుందని, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రపంచాన్ని జయించే శక్తి.. క్రీడాకారులకు ఉంటుందని చెప్పారు. 

loader