వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులన్నింటినీ కొట్టేస్తున్నారా? చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శనివారం పార్టీలోని ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అలాగనే చెప్పారు. జగన్ పై ఉన్న కేసులన్నింటినీ త్వరలో కొట్టేస్తారని ప్రచారం జరుగుతోందని చంద్రబాబు అన్నారు.

ప్రచారం జరుగుతున్న విషయాన్ని చంద్రబాబు అయితే ప్రస్తావించరు కదా? జగన్ కేసుల విషయంలో కేంద్ర స్ధాయిలో చంద్రబాబుకు పక్కాగా సమాచారం ఉంటేనే టెలికాన్ఫరెన్సులో ప్రస్తావించి ఉంటారు. అందులో భాగంగానే జగన్ కేసుల్లో ఒక్కోదానిలోను సడలింపులు వస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అంటే జగన్ పై చంద్రబాబుకున్న అక్కసకు అసలు కారణం ఇదేనన్నమాట.