Asianet News TeluguAsianet News Telugu

బిజెపికి కొత్త పూజారి: కన్నాపై చంద్రబాబు సెటైర్

ఆంధ్రప్రదేశ్ బిజెపికి కొత్త పూజారి వచ్చాడని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ నియామకంపై వ్యాఖ్యానించారు. 

Chandrababu satires on Kanna Lakshminarayana

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ బిజెపికి కొత్త పూజారి వచ్చాడని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ నియామకంపై వ్యాఖ్యానించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన అంకరార్పణ చేశారు. ఆ తర్వాత రంగసాగారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడని కన్నా సర్టిఫికెట్ ఇచ్చారని, వైసీపీలో చేరడానికి సిద్ధమైన నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసిందని విమర్శించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు తనపై విమర్శలు చేయడం బాధాకరమని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు.
 
యాభై లక్షల మందికి పింఛన్లు ఇచ్చి పెద్దకొడుకునయ్యానని ఆయన చెబుకున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. ఐదు బడ్జెట్లలో తెలుగు ప్రజలకు కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తన కన్నా బాగా చేస్తే చర్చకు రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.

సీఎం చంద్రబాబును కలియుగ ఆర్థర్ కాటన్ గా పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఢిల్లీ పెద్దలకు వణుకు పుడుతోందని అన్నారు. ప్రధానిని ఢీ కొట్టే సత్తా చంద్రబాబుకే ఉందని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన రోడ్లపైనే ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేస్తున్నారని, జగన్ రోడ్లపై చేసే పాదయాత్రల కన్నా జైళ్లకు చేసే పాదయాత్రలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. జగన్ ఫ్యాన్ స్విచ్ ప్రదాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేతుల్లో ఉందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios