చంద్రబాబుకు కంటిసమస్య.. చికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుల నివేదిక.. జైలు అధికారులు ఏమంటున్నారంటే..
చంద్రబాబుకు కంటి చికిత్స అవసరం అంటూ ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఆ నివేదిక మార్చి ఇవ్వాలని జైలు అధికారులు ఒత్తిడి తెచ్చారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యం గత కొద్ది రోజులుగా ఇబ్బందిగా ఉంది. ఆయనకు హై బిపి, షుగర్, ఎలర్జీ లాంటివి రావడంతో.. జైల్లో ఏసీ ఏర్పాటు చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో చంద్రబాబుకు జైల్లో రోజూ క్రమం తప్పకుండా రెండు నుంచి మూడుసార్లు హెల్త్ చెకప్ లు చేస్తున్నారు అధికారులు. బుధవారం చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిశీలించిన ప్రభుత్వ ఆసుపత్రి కంటి వైద్యులు చంద్రబాబుకు కంటి సమస్యలకు చికిత్స అవసరమని చెప్పినట్లుగా టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ఆ నివేదికను మార్చి ఇవ్వాలని.. జైలు అధికారులు ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తురారని ఆరోపణలు గుప్పించారు. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందని, ఆరోగ్య సమస్యలను కావాలనే దాచి పెడుతోందని టిడిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. బుధవారం జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులిటన్లో కూడా కంటి సమస్యను ప్రస్తావించలేదు.
నేను రాజకీయాల కోసం రాలేదు.. నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని.. : భువనేశ్వరి
దీనిమీద టిడిపి వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టిడిపి ఆరోపణల మీద రాజమహేంద్రవరం రైలు సూపర్డెంట్ రాహుల్ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నాలుగు నెలల క్రితం ఒక కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. రెండో కంటికి వెంటనే ఆపరేషన్ అవసరం లేదని బుధవారం నాడు ఆయనను పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు చెప్పారని తెలిపారు.