న్యూఢిల్లీ: ప్రజలనాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్‌పోల్స్‌ విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలోనూ వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు ట్వీట్ చేశారు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం ఉందన్నారు. 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌ నుంచి వెనక్కి తగ్గబోమని అన్నారు. 

వీవీప్యాట్లు, ఈవీఎం ఓట్లలో తేడా ఉంటే అన్ని వీవీప్యాట్లు లెక్కించాలని బాబు డిమాండ్ చేశారు.