Asianet News TeluguAsianet News Telugu

అవన్నీ తప్పు, దెబ్బ తీసే యత్నం: మోడీకి చంద్రబాబు లేఖ

కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు.

Chandrababu opposes Modi govt's policies

అమరావతి: కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో చెప్పిన జనాకర్షక పథకాలపై సమీక్ష అనే అంశం అభ్యంతరకరమని ఆయన అన్నారు. 

ఉచిత విద్యుత్తు పథకాన్ని దెబ్బ తీసే ప్రయత్నం దాని ద్వారా జరుగుతోందని అన్నారు. తమ రాష్ట్రంలో వరిసాగు ఖర్చు హెక్టారుకు రూ.1.08 లక్షలు అవుతోందని, క్వింటాలుకు రూ.1702 సాగు ఖర్చు అవుతోందని ఆయన చెప్పారు. 

సాగు ఖర్చు రూపాయి అవుతుంటే మద్దతు ధర 83 పైసులు ఉండడం సరి కాదని అన్నారు. వరితో పాటు ఇతర పంటలకు కూడా మద్దతు ధరను ప్రకటించాలని ఆయన కోరారు. పంటల బీమా పథకంలోని నిబంధనల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. 

బ్యాంకులకు విధించి నిబంధనతో చిక్కులు ఏర్పడుతున్నిాయని,త రుణాల వివరాలు జాతీయ పంటల బీమా పోర్టల్ లో నమోదు చేయాలనే నిబంధనతో ఆ చిక్కులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios