మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతికి దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతికి దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దాదాపు 13 రాష్ట్రాలు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాయి. 

తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఏపీలోనూ ఏడు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 

వాజ్‌పేయి నిరంతరం పని కోరుకునే వ్యక్తి అని, ఆయన సెలవును ఇష్టపడరని, అందుకే తాము సెలవు ప్రకటించలేదని చంద్రబాబు చెప్పారు.

ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రభుత్వాలు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాయి.