జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు.. పవన్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా పవన్ కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలని.. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు కోరారు. పవన్ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు రావాలని టీడీపీ అధినేత ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 

Also Read:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్

కాగా ఈ నెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగిటివ్ వచ్చింది. అయితే ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒక్కొక్కరు కరోనా బారినపడుతుండటంతో పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

అయితే శుక్రవారం కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో కరోసారి కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చిందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.