అనంతపురం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇంకా రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.. ఈ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.

అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుండి  చిత్తూరు జిల్లాకు నీటిని మంగళవారం నాడు విడుదలచేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నదుల అనుసంధానాన్ని చేసిన చూపిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని బాబు చెప్పారు. కృష్ణా, గోదావరి నదులను పట్టిసీమ ద్వారా అనుసంధించినట్టు బాబు గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టును ఈ ఏడాది మే నాటికి పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 4 వేల కోట్లు ఇవ్వాలన్నారు. చట్టంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కృష్ణాడెల్టాకు  వాడుకొనే కృష్ణా నీటిని శ్రీశైలంలో నిల్వ ఉంచి రాయలసీమకు నీటిని అందిస్తున్నట్టు బాబు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడ నీటి సమస్య లేకుండా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

సాగు నీటి సమస్య లేదనే కారణంగా వరి పంట వేయకూడదన్నారు. అనంతపురంలో ఎక్కువగా పండ్లతోటలు వేయడం వల్ల రైతులు అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్నారని బాబు గుర్తు చేశారు.

ఎన్ని ఇబ్బందులున్నా కూడ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందని చంద్రబాబునాయుడు చెప్పారు.  డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమాన్ని ప్రారంభించినట్టు బాబు గుర్తు చేశారు. 

వడ్డీలేని రుణాలను డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నట్టు బాబు చెప్పారు. తెలంగాణలో ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పారు. జనాభా తక్కువగా ఉందని చెప్పారు. తెలంగాణ, తమిళనాడుతో పాటు ఏ రాష్ట్రాల్లో ఇవ్వకున్నా ఏపీలో మాత్రమే డ్వాక్రా సంఘాలకు నిధులను ఇచ్చినట్టు చెప్పారు.