వైఎస్ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ముఖ్యమంత్రి యువనేస్తం’’ పథకాన్ని సీఎం ఇవాళ ఉండవల్లిలో ప్రారంభించారు.

వైఎస్ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ముఖ్యమంత్రి యువనేస్తం’’ పథకాన్ని సీఎం ఇవాళ ఉండవల్లిలో ప్రారంభించారు. అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనను విమర్శించే వారు ఏమీ సాధించలేకపోయారని.. దొంగ లెక్కలు రాసుకుని అడ్డంగా దొరికిపోయారన్నారు..

వైఎస్ హయాంలో ఇష్టానుసారం దొంగ లెక్కలు రాసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తూ అందరినీ అడుక్కుంటున్నారని విమర్శించారు. రాజకీయాల గురించి.. పాలన గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లు రోడ్డెక్కి మాట్లాడుతున్నారని సీఎం అన్నారు.

మన కులం.. మనవాడు అనుకుంటే ఎవరూ తిండి పెట్టరని.. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు.. సినిమాలు వేరు... రాజకీయాలు వేరని ముఖ్యమంత్రి పరోక్షంగా పవన్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు.

2004లో టీడీపీ అధికారంలోకి వచ్చుంటే అభివృద్ధి విషయంలో సమైక్యాంధ్ర ముందంజలో ఉండేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఏం ఫర్వాలేదని.. కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటాని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.