అమరావతి:అసెంబ్లీ పవిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు టీడీపీ చంద్రబాబునాయుడు. జగన్ ముమ్మాటికీ ఫేక్ సీఎం అని ఆయన పునరుద్ఘాటించారు. జమిలీ ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వం ఉండదని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

గురువారం నాడు అమరావతిలో  చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.రామానాయుడిని డ్రామా నాయుడు అంటారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక  న్యాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు.

సీఎం జగన్ కు ఫండమెంటల్స్ రూల్స్ తెలియవన్నారు.  వీసీ నియామకాల్లో మెజారిటీ రెడ్లకే కట్టబెట్టినట్టుగా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. చినరాజప్పను ద్వారంపూడి దుర్బాషలాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

బీసీ వర్గానికి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ద్వారంపూడి ఇంటికి పంపి క్షమాపణ చెప్పించారన్నారు.కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తప్పులు చేసే పోలీసులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు. 

 టీడీపీ సానుభూతిపరుల ఫించన్, రేషన్ కార్డులను తొలగిస్తున్నారన్నారు. నాలుగు విడతల్లో ఫించన్ ను రూ. 3 వేలకు పెంచుతామన్న  సీఎం హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.ఒక్క ప్రశ్న వేస్తే 10 మందితో ఎదురుదాడి చేయిస్తున్నారన్నారు. పెన్షన్ల విషయంలో అసెంబ్లీని జగన్ తప్పుదోవ పట్టించారని చంద్రబాబు చెప్పారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను భారీగా తొలగించారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇచ్చిన జగన్ పై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ తీరుతో ఒక్కో లబ్దిదారుడు రూ. 45 వేలు నష్టపోతున్నారన్నారు.జగన్ జీరో సీఎం, అవవగాహన లేని ముఖ్యమంత్రి అని చంద్రబాబు చెప్పారు. నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేశారన్నారు. కార్పోరేషన్ల వారీగా ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు.

also read:ఏపీ అసెంబ్లీ: నాలుగో రోజు 8 మంది టీడీపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్

అసెంబ్లీ ఏమైనా జగన్ తాత జాగీరా అని ఆయన ప్రశ్నించారు. తమను అసెంబ్లీకి రావొద్దంటారా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు.అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.తమకు వాకౌట్ చేసే అధికారం లేదా అని ఆయన ప్రశ్నించారు.ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన జగన్ పై విమర్శలు గుప్పించారు.