మొదటి రోజు చెప్పిన దానిని పరిపూర్ణంగా అనుసరిస్తున్నారు.. వైసీపీ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైరికల్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. అయితే వైసీపీ నాలుగేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో వైసీపీ నాలుగేళ్ల పాలనపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే వైసీపీ నాలుగేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా వేదిక కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలతో పాటు.. ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్ అంటూ జగన్ చెబుతున్న మాటలతో కూడిన వీడియోను చంద్రబాబు షేర్ చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనపై సెటైర్లు వేశారు. ‘‘అవును.. మొదటి రోజు మీరు చెప్పిన దానిని మీరు, మీ ప్రభుత్వం పరిపూర్ణంగా అనుసరిస్తున్నాయి. విధ్వంసం వైపు ఏపీ ప్రయాణం దీనితో ప్రారంభమైంది. మీ క్రూరమైన పర్యవేక్షణలో 5వ సంవత్సరం వరకు కొనసాగుతుంది’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read: గుంటనక్కలు నిద్రలేచాయి.. ఏమరపాటుగా ఉంటే వెన్నుపోట్లు, పక్కపోట్లు: సజ్జల