Asianet News TeluguAsianet News Telugu

‘నన్ను మెప్పించడం కాదు.. ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలి’.. కుప్పం నేతలతో సమీక్షలో చంద్రబాబు...

బాంబులకే భయపడలేదని, రాజకీయ నేరగాళ్లకు భయపడతామా అని కుప్పం నేతలతో జరిగిన సమీక్షలో చంద్రబాబు ప్రశ్నించారు. స్థానిక నాయకుల అతివిశ్వాసం వల్లే కుప్పంలో ఓటమి పాలయ్యామన్న చంద్రబాబు.. వార్డుల వారీగా రహస్య నివేదికలు ఇవ్వాలని అభ్యర్థులను ఆదేశించారు.

chandrababu naidu review meeting with kuppam leaders
Author
Hyderabad, First Published Dec 9, 2021, 8:44 AM IST

అమరావతి : చిత్తూరు జిల్లా kuppam నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తామని తెదేపా అధినేత chandrababu naidu స్పష్టం చేశారు. Kuppam municipality అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో  
Coverts తయారయ్యారని.. వారిని ఏరి పారేస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలో ఇకపై సమర్థులకే పట్టం కడతామని అన్నారు. 

తనను మెప్పించడం కాదని, ప్రజల్లోకి వెళ్లి పని చేసే వారికే సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే అరాచక శక్తులు చేసిన పనులను వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. బాంబులకే భయపడలేదని, 
Political criminalsకు భయపడతామా అని ప్రశ్నించారు. స్థానిక నాయకుల అతివిశ్వాసం వల్లే కుప్పంలో ఓటమి పాలయ్యామన్న చంద్రబాబు.. వార్డుల వారీగా రహస్య నివేదికలు ఇవ్వాలని అభ్యర్థులను ఆదేశించారు.

కుప్పంలో పార్టీ పటిష్టానికి సమర్థులైన నాయకులతో Co-ordination Committee ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల రోజు మహిళల పోరాట పటిమకు చంద్రబాబు కితాబునిచ్చారు. కుప్పం నేతలతో దాదాపు మూడు గంటల పాటు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఇదిలా ఉండగా, నవంబర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో వైసీపీ జయకేతనం ఎగరవేసింది. 

చంద్రబాబు 'కుప్పం' కోట బద్దలు: చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి

కుప్పం మున్సిపాలిటిలో మొత్తం 25 స్థానాలు ఉండగా.. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

Kuppam municipality టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉండటంతో.. టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే చంద్రబాబు కంచుకోటలో జెండా ఎగరవేయాలని అధికార వైసీపీ భావించింది. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ ఫలితంపైనే ఉంది. అయితే కుప్పం మున్సిపాలిటిలో మొత్తం 25 స్థానాలు ఉండగా.. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. 

ఏకగ్రీవంతో కలిపి వైసీపీ 19 స్థానాలు సొంతం చేసుకుని కుప్పం మున్సిపల్ పీఠం దక్కించుకుంది. ఇక, టీడీపీ 6 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. ఇక, దర్శి మినహా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ, నెల్లూరు కార్పొరేషన్‌ను కూడా వైసీపీ కైవసం చేసుకుంది.  కుప్పంలో వైసీపీ విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఉంది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 2014 నుంచి చూస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి మరోసారి విజయం సాధించినప్పటికీ.. వైసీపీ అభ్యర్థికి కూడా భారీగానే ఓట్లు పోలయ్యాయి. 2019లో భారీ మెజారిటీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. కుప్పంపై ఆ పార్టీ మరింతగా ఫోకస్ పెంచింది.

Follow Us:
Download App:
  • android
  • ios