మంత్రుల దాడులను తట్టుకొని శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోరాటం చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభినందించారు.


అమరావతి: మంత్రుల దాడులను తట్టుకొని శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోరాటం చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభినందించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారం నాడు చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనమండలిలో నిన్న చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన చర్చించారు.

also read:మంత్రులు తొడగొట్టారు, పోడియం చుట్టుముట్టారు: మండలి పరిణామాలపై యనమల

శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన పోరాటాన్ని చంద్రబాబునాయుడు అభినందించారు. అనారోగ్యం, వృద్ధాప్యం లెక్క చేయకుండా ఎమ్మెల్సీలు హాజరయ్యారని ఆయన కితాబిచ్చారు. శాసనమండలిలో ఎమ్మెల్సీలు పార్టీ గర్వపడేలా పోరాటం చేశారని ఆయన అభినందించారు.

వైసీపీ ప్రలోభాలకు లొంగిపోయి కొందరు ఎమ్మెల్సీలు చరిత్ర హీనులుగా మారారన్నారు. మంత్రుల దాడులను తట్టుకొని ఎమ్మెల్సీలు పోరాటం చేయడం అభినందనీయమన్నారు.

పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పోరాటం చేసిన ఎమ్మెల్సీలు చరిత్రలో నిలిచిపోయారని ఆయన చెప్పారు. పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు మంత్రులతో పోరాటం చేశారని ఆయన కితాబు ఇచ్చారు. 

ఏపీ శాసనమండలిలో ఈ నెల 17వ తేదీన సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సమయంలో మంత్రులు, టీడీీపీ ఎమ్మెల్సీలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పక్షాలు ఒకానొక దశలో ఇరు వర్గాల మధ్య తోపుటాట కూడ చోటు చేసుకొంది.