Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ దెబ్బ: మూడు రోజుల పాటు కుప్పంలో బాబు టూర్

పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో మూడు రోజుల పాటు చంద్రబాబునాయుడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 25 నుండి 27వ తేదీవరకు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.

Chandrababu naidu  plans to visit kuppam segment from feb 25 to 27 lns
Author
Amaravathi, First Published Feb 22, 2021, 8:37 PM IST

అమరావతి: పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో మూడు రోజుల పాటు చంద్రబాబునాయుడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 25 నుండి 27వ తేదీవరకు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.

పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు.  టీడీపీకి గట్టి పట్టున్న గ్రామాల్లో కూడ ఆ పార్టీ ఆశించిన ఫలితాలు దక్కలేదు.  కుప్పం నియోజకవర్గంలో కూడ వైసీపీ అత్యధిక స్థానాలను దక్కించుకొంది. టీడీపీ నామ మాత్రపు ఫలితాలతోనే సరిపెట్టుకొంది.

ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు ఒక్కసారి కుప్పంలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చంద్రబాబు మరోసారి పర్యటించనున్నారు.

కుప్పం నియోజకవర్గంంలోని శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం మండలాల్లో చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు.

పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి అనుహ్య ఫలితాలు ఎలా వచ్చాయనే విషయమై చంద్రబాబునాయుడు  ఆరా తీయనున్నారు. పార్టీ క్యాడర్ ఎదుర్కొంటున్న  సమస్యలపై ఆయన చర్చించనున్నారు. 

రానున్న రోజుల్లో వైసీపీని ఎలా ఎదుర్కోవాలనే విషయమై  క్యాడర్ కు దిశా నిర్ధేశం చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios