Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 2019: ఆ 11 మందికి లైన్‌క్లియర్, కొత్త ముఖాలకు చోటు

ఎన్నికల కోసం  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. 

chandrababu naidu plans to finalise tdp mp candidates
Author
Amaravathi, First Published Oct 3, 2018, 3:37 PM IST

అమరావతి: ఎన్నికల కోసం  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. 2019లో  ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలను కైవం చేసుకోవాలని  ఆ పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు  ప్లాన్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకొన్నాయి.  ఈ ఎన్నికల్లో  టీడీపీ,బీజేపీ కూటమి ఎక్కువగా ఎంపీ సీట్లను కైవసం చేసుకొంది. 

గత ఎన్నికల్లో విశాఖపట్టణం, రాజంపేట, తిరుపతి, నర్సాపురం ఎంపీ సీట్లను బీజేపీకి టీడీపీ కేటాయించింది. విశాఖ, నర్సాపురం స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 

అయితే వచ్చే ఎన్నికల్లో  కొన్ని సీట్లలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కొత్త వారిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు.  నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి, నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరాలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే చర్చ సాగుతోంది.  ఆనారోగ్య కారణాలతో  ఈ కుటుంబాల నుండి వేరేవాళ్లను బరిలోకి దింపుతారా.. లేదా పార్టీకి చెందిన ఇతర నేతలను బరిలోకి దింపుతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గత ఎన్నికల్లో పోటీ చేసిన 11 మంది మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుండి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుండి ఆశోక్ గజపతిరాజు, అమలాపురం నుండి పి.రవీంద్రబాబు, ఏలూరు నుండి మాగంటి బాబు, విజయవాడ నుండి కేశినేని నాని, మచిలీపట్నం నుండి కొనకళ్ల నారాయణరావు, గుంటూరు నుండి గల్లా జయదేవ్, బాపట్ల నుండి శ్రీరాం మాల్యాద్రి, చిత్తూరు నుండి శివప్రసాద్, కర్నూల్ నుండి బుట్టా రేణుకలకు చంద్రబాబునాయుడు ఎంపీలుగా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అరకులో ఒక ఉన్నతాధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన త్వరలో రిటైర్‌ కానున్నారు. బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ సీట్లో ఈసారి కొత్త అభ్యర్థి తెరపైకి రానున్నా రు. 

మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి, ఆయన మనవ డు భరత్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు ప్రచారంలో ఉన్నాయి. కొంత మంది మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రచారంలో ఉంది. 

టీడీపీ అధిష్ఠానం ఇంకా ఈ సీటుపై స్పష్టతకు రాలేదు. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఆ సీటును చలమలశెట్టి సునీల్‌కు ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. చంద్రబాబును ఇటీవల తరచూ కలుస్తు న్న ఆయన కొద్ది రోజుల్లో అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. బీజేపీ ఎంపీ గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం సీటుకు తన అభ్యర్థిని టీడీపీ అంతర్గతంగా ఖరారు చేసింది


పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజును నిలపనున్నట్లు సమాచారం. రాయపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట సీటుకు గట్టి అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. టీటీ డీ చైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు, అటవీ మం త్రి సిద్ధా రాఘవరావు, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. 

గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన తిరుపతి(ఎస్సీ) స్ధానంలో ఈసారి టీడీపీ అభ్యర్థిని నిలపనుంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి జయరాజ్‌ తర్వాత టీడీపీలో చేరారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పర్సా రత్నం, నెలవల సుబ్రమణ్యం పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన కుమారుడు పవన్‌ రెడ్డికి అవకాశమివ్వాలని చంద్రబాబును కోరారు.

హిందూపురం ఎం పీ నిమ్మల కిష్టప్ప అసెంబ్లీకిరావాలని కోరుకుంటున్నా రు. కానీ అధిష్ఠానం ఏ నిర్ణయానికీ రాలేదు. ఆయన్ను అసెంబ్లీకి తీసుకొస్తే ఎంపీగా కొత్తవారికి చాన్సు వస్తుంది. కడపలో..జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం వి వాద పరిష్కారం కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి.. మండలిలో ప్రభుత్వ విప్‌ పి.రామసుబ్బారెడ్డిల్లో ఒకరిని కడప ఎంపీగా నిలపాలని టీడీపీ భావిస్తోందనే ప్రచారం సాగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios