అస్వస్థతకు  గురైన  తారకరత్నకు చికిత్స అందిస్తున్న వైద్యులతో  చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు.  

కుప్పం: అస్వస్థతకు  గురైన   సినీ నటుడు  తారకరత్న కుప్పం ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్నారు. కుప్పంలోని పీఈఎస్  ఆసుపత్రి వైద్యులకు   టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  ఇవాళ ఫోన్  చేశారు. తారకరత్న  ఆరోగ్య పరిస్థితిని గురించి వాకబు చేశారు.   కుప్పంలో   నారా లోకేష్  యువగళం పేరుతో  శుక్రవారంనాడు పాదయాత్రను ప్రారంభించారు.ఈ పాదయాత్రలో  లోకేష్ తో పాటు  తారకరత్న పాల్గొన్నారు. లోకేష్ తో పాటు  పాదయాత్ర  చేస్తున్న సమయంలో తారకరత్న  అస్వస్థతకు  గురయ్యారు.  వెంటనే తారకరత్నను  టీడీపీ శ్రేణులు ఆసుపత్రికి తరలించారు.  కేసీ ఆసుపత్రిలో  ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అక్కడి నుండి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తారకరత్నను తరలించారు.  

పీఈఎస్  మెడికల్ కాలేజీ వైద్యులకు  ఇవాళ చంద్రబాబునాయుడు ఫోన్  చేశారు. తారకరత్నకు మెరుగైన వ్యైద్య సహయం అందించాలని  చంద్రబాబు  కోరారు.  తారకరత్న  ఆరోగ్య పరిస్థితి గురించి  ఆయన  అడిగి తెలుసుకున్నారు.   యాంజియోగ్రామ్ నిర్వహించిన  తర్వాత  తారకరత్నకు బ్లాక్ ను గుర్తించారు. వెంటనే  స్టంట్  వేశారు వైద్యులు. తారకరత్నకు  ఆసుపత్రిలో  చికిత్స జరుగుతున్నంతసేపు బాలకృష్ణ అక్కడే ఉన్నారు. బాలకృష్ణతో పాటు   రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంబ్ల బుచ్చయ్య చౌదరి కూడా అక్కడే ఉన్నారు. 

also read:తారకరత్నకు స్టంట్ వేసిన వైద్యులు: నిలకడగా ఆరోగ్యం

తారకరత్నకు  వైద్యులు స్టంట్ వేసిన తర్వాత   బాలకృష్ణ  ఐసీయూ నుండి బయటకు వచ్చి  తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబుకు  ఫోన్ చేసి చెప్పారు.తారకరత్నకు స్టంట్ వేసిన విషయాన్ని వివరించారు.   తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి  పలువరు నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణకు ఫోన్  చేసి తెలుసుకున్నారు.