విజయవాడ: కృష్ణమ్మ ఒడిలో బోట్ రేసింగ్ పోటీలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఎఫ్‌1 హెచ్‌2 వో సీ బోటు రేసింగ్‌ ప్రారంభోత్సవంలో చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మిణి, లోకేష్ తనయుడు దేవాన్స్ తో పాటు డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఇతర మంత్రులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా కృష్ణానదిలో బోటులో చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రయాణించారు. మంత్రి లోకేష్ కూడా సీ బోటును నడుపుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. ఎఫ్‌1 హెచ్‌2 వో పోటీలు అమరావతిలో నిర్వహించడం సంతోషకరంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఎఫ్‌1 హెచ్‌2 వో పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. తాజ్‌మహల్‌ అంత అందమైన అసెంబ్లీని నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అడ్వెంచర్‌ టూరిజానికి ఏపీ ఐకాన్‌గా మారనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇకపోతే మూడు రోజులపాటు జరగనున్న ఈపోటీలలో19 బోట్స్ రేస్ లో పాల్గొననున్నాయి. 350 మందికి పైగా రేసర్లు పాల్గొంటారు. రేసర్లకు ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. అలాగే బోట్ కి 250 కిలోమీటర్ స్పీడ్ నిర్ణయించారు. రేస్ కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నదిని శుభ్రం చేయడంతోపాటు వాటర్ లెవెల్ పెంచడంతో కృష్ణమ్మ నిండుగా కనిపించింది.

ఇకపోతే బోర్ రేస్ ప్రారంభోత్సవంలో లోకేష్ తనయుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దేవాన్ష్ హంగామాకు అంతా ముచ్చటపడ్డారు. మరోవైప మంత్రి నారా లోకేష్ దేవాన్ష్ ను మెడపై ఎక్కించుకుని అన్నీ చూపిస్తూ వివరించారు. మెుత్తానికి తండ్రికొడుకులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనబడ్డారు.