నెల్లూరు: హస్తిన కేంద్రంగా ఈనెల 11న చేపట్టబోతున్న ధర్మపోరాట దీక్షకు హాజరుకావాలని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కోరినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ గృహా సముదాయాలను ప్రారంభించిన సీఎం అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలు, ప్రజా సంఘాలంతా రాష్ట్రం వైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. 

దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, ఎవరు రాష్ట్రం కోసమో, ఎవరు రాజకీయాల కోసమో ఢిల్లీలో జరిగే ఆందోళనే తేలుస్తుందన్నారు. ధర్మపోరాటదీక్షకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించామని వాళ్లు రాకపోతే ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.