అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు ఉదయం నేలపాడులో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న హైకోర్టు భవనాలను ముఖ్యమంత్రి బాబు పరిశీలించారు. హైకోర్టు భవనం ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయంలో కొనసాగుతున్న  విషయం తెలిసిందే.

హైకోర్టు భవన నిర్మాణాలను  పూర్తి చేస్తే  హైకోర్టు కార్యకలాపాలు కొత్త భవనం నుండి ప్రారంభించనున్నారు. చంద్రబాబునాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరీ, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడ  ఈ భవన నిర్మాణాలను పరిశీలించారు. భవన నిర్మాణ సమయంలో  అధికారులకు చంద్రబాబునాయుడు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.