విజయవాడ: పుట్టిన ఊరిని మర్చిపోవద్దని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  చెప్పారు. తమ గ్రామాభివృద్దికి తోచిన సహాయం చేయాలని ఆయన సూచించారు.కృష్ణా జిల్లా కొమరోలు గ్రామాన్ని సీఎం సతీమణి భువనేశ్వరీ దత్తత తీసుకొన్నారు. ఈ గ్రామంలో  పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం ఆదివారం నాడు ప్రారంభించారు.

భువనేశ్వరీ తల్లి బసవతారకం ఈ గ్రామంలోనే పుట్టారు. దీంతో ఈ గ్రామాన్ని భువనేశ్వరీ దత్తత తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబసభ్యులు కూడ పాల్గొన్నారు.

గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు చంద్రబాబునాయుడుతో పాటు నందమూరి కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమరోలు గ్రామాన్ని భువనేశ్వరీ దత్తత తీసుకోవడం వల్ల  అభివృద్ది జరిగిందనే దానిలో వాస్తవం లేదన్నారు.

గ్రామంలో అభివృద్ది పనులను  చేయించేందుకు భువనేశ్వరీ ఆసక్తిని చూపారని బాబు గుర్తుచేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని గ్రామాల్లో  అభివృద్ది కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని  ఆయన గుర్తు చేశారు.