Asianet News TeluguAsianet News Telugu

ANDHRA PRADESH: విద్యాసంస్థలకు వెంటనే సెలవులు ఇవ్వాలి: చంద్రబాబు

ANDHRA PRADESH: ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం క్ర‌మంగా పెరుతున్న‌ది. రోజువారి కోవిడ్ కేసులు అధికం అవుతున్నాయి. అయితే, సంక్రాంతి సెల‌వులు ముగియ‌డంతో పాఠ‌శాల‌లు తెర‌వ‌డానికి సిద్ధమైంది ఏపీ ప్ర‌భుత్వం. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు.. క‌రోనా ప‌రిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు వెంట‌నే సెల‌వులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. 
 

chandrababu naidu fire on ap government decision.. demand extended schoolsto holidays
Author
Hyderabad, First Published Jan 18, 2022, 12:48 AM IST

ANDHRA PRADESH: ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా వైర‌స్  మ‌హ‌మ్మారి ప్ర‌భావం మ‌ళ్లీ పెరుగుతున్న‌ది. దీంతో కొత్త‌గా  కోవిడ్‌-19 బారిన‌ప‌డుతున్న వారి రోజువారీ సంఖ్య పెరుగుతున్న‌ది. దీనికి తోడూ ఇటీవ‌లే సంక్రాంతి పండుగ సంబ‌రాలు ముగిశాయి. ప‌ట్నం నుంచి ప‌ల్లేల‌కు జ‌నాలు వెళ్లారు. పండుగ నేప‌థ్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జ‌లు గుంపులుగా పాల్గొన్నారు. దీని కార‌ణంగా రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus) విజృంభించే ప్ర‌మాదం పొంచివున్న‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

ఇలాంటి ప‌రిస్థితుల నేల‌కొన్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (ANDHRA PRADESH) ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. సంక్రాంతి సెల‌వులు ముగియ‌డంతో పాఠ‌శాల‌లు తెర‌వ‌డానికి సిద్ధమైంది ఏపీ ప్ర‌భుత్వం. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు.. క‌రోనా ప‌రిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు వెంట‌నే సెల‌వులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన కరోనా వల్ల 12 రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారని (Chandrababu Naidu) గుర్తు చేశారు. 

విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులు పొడిగించాలని చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు.  రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్య‌మంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా (YCP) పాలనలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులపై దాడులు పెరిగిపోతున్నాయని చంద్ర‌బాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  రైతువ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం రైతులకు సకాలంలో డబ్బు చెల్లించాలని డిమాండ్  (Chandrababu Naidu) చేశారు. నష్టపోయిన కంది, మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కేసినో కల్చర్, పేకాట క్లబ్బులు పెరిగాయని Chandrababu Naidu విమర్శించారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. వైకాపా పాల‌న‌లో డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటూ విమ‌ర్శించారు. పాఠ‌శాల‌లు తిరిగి తెర‌వ‌డంపై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minster Adimulapu Suresh) స్పందిస్తూ.. కరోనా వ్యాప్తికి, స్కూళ్లు తెరవటానికి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. కావాల‌నే విప‌క్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. విద్యార్థులు నష్టపోకూడదనే స్కూళ్లు తెరిచామని మంత్రి స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా మ‌హ‌మ్మారి కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని (Minster Adimulapu Suresh) అన్నారు. 

రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరిస్థితులపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ..  ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  గారికి లేఖ రాశానని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయనే విషయాన్ని గుర్తు చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios