స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఎఫ్‌ఐఆర్ దశలో విచారణలో జోక్యం చేసుకోవడం సరికాదని చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పును వెలువరించారు. అయితే హైకోర్టు తీర్పును చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.