Asianet News TeluguAsianet News Telugu

జగన్! నీ చరిత్ర మాట్లాడితే దారుణంగా ఉంటుంది : చంద్రబాబు ఆగ్రహం

జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేయడం నీచమని తాను నీచ రాజకీయాలకు పాల్పడనని తెలిపారు. తాము సామాజిక న్యాయం అమలు చేయడంలో ముందున్నట్లు తెలిపారు. 

chandrababu naidu counter on ys jagan comments
Author
Delhi, First Published Feb 4, 2019, 9:44 PM IST

ఢిల్లీ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఒక కులానికి ప్రాధాన్యం ఇస్తున్నానంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 

జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేయడం నీచమని తాను నీచ రాజకీయాలకు పాల్పడనని తెలిపారు. తాము సామాజిక న్యాయం అమలు చేయడంలో ముందున్నట్లు తెలిపారు. 

నా కేబినెట్‌లో నలుగురు రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్నారని అలాగే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని తెలిపారు. జగన్‌ లాంటి వారి చరిత్ర మాట్లాడితే దారుణంగా ఉంటుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఏపీలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లున్నాయని జగన్ ఆరోపించడంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చారని.. ఘట్టమనేని శ్రీనివాస్‌ కోసం లేని పోస్టు సృష్టించారని వైఎస్ జగన్ సంచలన ఆరోపణ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios