Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ పతనానికి ఇది ఆరంభం మాత్రమే.. చంద్రబాబు నాయుడు

వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇది ఆరంభం మాత్రమేనని, వైసీపీని ఎవరూ కాపాడలేరని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆయన ఈ విధంగా మాట్లాడారు.

chandrababu naidu comments on ycp over panchayat elections - bsb
Author
hyderabad, First Published Feb 22, 2021, 3:30 PM IST

వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇది ఆరంభం మాత్రమేనని, వైసీపీని ఎవరూ కాపాడలేరని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆయన ఈ విధంగా మాట్లాడారు. 

చంద్రబాబు నాయుడు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదన్నారు. వైసీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఎవరూ కాపాడలేరని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో వీరోచితంగా పోరాడారని, ప్రాంతాలు, కులాలకు అతీతంగా పోరాటం చేశారని మెచ్చుకున్నారు.

పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఇంకా 10 శాతం ఫలితారు టీడీపీకి పెరిగేవని, అదే జరిగితే వైసీపీ ఇప్పుడే పతనం అయ్యేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి ఎందుకు ఓటేయాలని, ధరలు పెంచినందుకు వైసీపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. 

వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసులు ఉన్నంతవరకే వైసీపీ నేతల ప్రతాపమని ఆయన దుయబట్టారు. వైసీపీ నేతలు రెండేళ్లకే మిడిసి పడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. 

ఏకగ్రీవాలు చేసుకోవాలన్న వైసీపీ ఆటలు సాగలేదన్నారు. కొత్త వలస టీడీపీ అభ్యర్థికి 250 మెజారిటీ వచ్చినా రీకౌంటింగ్‌ కోరతారా? టీడీపీ గెలిస్తే రీ కౌంటింగ్, వైసీపీ గెలిస్తే ఉండదా? అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios