Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు.. రెండేళ్లలో వచ్చేది మేమే, పిన్నెల్లికి వార్నింగ్

గుంటూరు జిల్లా (guntur district) మాచర్ల నియోజకవర్గంలోని (macherla) గుండ్లపాడు (gundlapadu) గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు (thota chandraiah) గురికావడం పట్ల టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రయ్య అంతిమయాత్రలో స్వయంగా చంద్రబాబు పాడె మోశారు. 

chandrababu naidu attends tdp activists funeral in macherla
Author
Macherla, First Published Jan 13, 2022, 8:17 PM IST

గుంటూరు జిల్లా (guntur district) మాచర్ల నియోజకవర్గంలోని (macherla) గుండ్లపాడు (gundlapadu) గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు (thota chandraiah) గురికావడం పట్ల టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ క్యాడర్‌ను భయాందోళనలకు గురిచేసేందుకు వైసీపీ రౌడీమూకలే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయంటూ చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన గురువారం వెల్దుర్తి మండలం గుండ్లపాడు వెళ్లి... చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అంతేకాదు, చంద్రయ్య అంతిమయాత్రలో స్వయంగా చంద్రబాబు పాడె మోశారు. కాగా, చంద్రబాబు రాక విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించాలని చంద్రయ్య అనుకున్నారని, 
ఇప్పుడు ఆయన అంతిమయాత్రలో పాల్గొనాల్సి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే సీఎం జగన్ మాట్లాడాలి.... సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జాగీరు కాదని.. మాకు ఉపన్యాసాలు చెప్పొద్దని బోండా ఉమా, బుద్దా వెంకన్న వస్తే ఏమి చేశారని చంద్రబాబు నిలదీశారు. పిన్నెల్లి పిల్లి మాటలు మాట్లాడుతున్నాడని నువ్వో పుడింగివా..? మా నేతలపై దాడిచేసిన వారిని మునిసిపల్ చైర్మన్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

బ్రహ్మారెడ్డి టీడీపీ ఇంచార్జ్‌గా రాగానే పిన్నెల్లి (pinnelli ramakrishna reddy) కాళ్ళ కింద భూమి కదులుతుందని.. ఈ హత్యాకాండకు సీఎం జగన్, డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ఆయన కుటుంబానికి భవిష్యత్‌లో అండగా ఉంటామని.. 33 మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ పొట్టన పెట్టుకుందని ఆయన ఆరోపించారు. శిక్ష పడేవరకు ఎవరిని వదలనని.. మాచర్ల ప్రజలు పిన్నెల్లికి ఊడిగం చెయ్యాలా అని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని.. పల్నాడు టైగర్ కోడెల వైసీపీ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే అందరిని చంపమని లైసెన్స్ ఇచ్చినట్లు కాదన్నారు.

20 అసెంబ్లీలలో అసలు పోటీ ఉండకూడదు అనేది వైసీపీ ప్రణాళిక అని.. చంద్రయ్య కుటుంబానికి పార్టీ నుంచి 25 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్లలో వచ్చేది టీడీపీనే అన్న ఆయన అప్పుడు పిన్నెల్లి ఇక్కడ ఉండడా అండూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నా అని చెప్పి పిన్నెల్లి ఈ హత్య చేయించారని చంద్రబాబు ఆరోపించారు. నేను జగన్‌కు ఒక మెసేజ్ ఇస్తున్నా...జగన్ తీరు మార్చుకోవాలని లేకపోతే ఉపేక్షించమన్నారు. పోరాడే వాళ్ళని హత్యా రాజకీయాలతో బయపెడతారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

 

"

 

Follow Us:
Download App:
  • android
  • ios