తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో బొజ్జల అంత్యక్రియలను నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో బొజ్జల అంత్యక్రియలను నిర్వహించారు. బొజ్జల అంత్యక్రియలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు. బొజ్జల అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు.. పాడెను మోశారు. ఇక, బొజ్జలకు అంతిమ యాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఇక, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఊరందూరుకు చేరుకుని బొజ్జల అంత్యక్రియలకు హాజరయ్యారు. బొజ్జల కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిన ఓదార్చారు. ఇక, చంద్రబాబు మాట్లాడుతూ.. ఆప్తమిత్రుడిని కోల్పోవడం బాధాకరమనిఅన్నారు. బొజ్జలను శ్రీకాళహస్తి ప్రజలు ఎప్పుడూ మరచిపోరని తెలిపారు. బొజ్జల స్పూర్తిని ఆయన కొడుకు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు.
ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంటకు తరలించారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ బొజ్జల భౌతికకాయాన్ని పార్టీ శ్రేణుల సందర్శనార్ధం రెండు గంటల పాటు ఉంచారు.
అనంతరం పట్టణ ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపుగా మధ్యాహ్నం 2.20 గంటలకు ఊరందూరుకు తరలించారు. బొజ్జల భౌతిక కాయాన్ని చూసి బంధువులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, బొజ్జల భౌతికకాయానికి మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు నివాళులర్పించారు. బొజ్జల సతీమణి బృందమ్మతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
