విజయవాడ పశ్చిమ (vijayawada west assembly constituency) నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ఎంపీ కేశినేని నానిని (kesineni nani) నియమించడంపై టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. కేశినేని నియామకంపై సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్ర (buddha venkanna) అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడ పశ్చిమ (vijayawada west assembly constituency) నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ఎంపీ కేశినేని నానిని (kesineni nani) నియమించడంపై టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. కేశినేని నియామకంపై సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్ర (buddha venkanna) అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అనుచరులతో ఇంటి వద్ద మీటింగ్ పెట్టారు బుద్ధా వెంకన్న. విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి పదవిని చివరి వరకు పార్టీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా (nagul meera) ఆశించినప్పటికీ.. కేశినేని వైపే చంద్రబాబు మొగ్గు చూపారు.
బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాకు ఇప్పటికే పార్టీలో వేర్వేరు బాధ్యతలు ఉన్నందున పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని కేశినేని నానికి అప్పగించారు చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేని నానికి చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
Also Read:నిన్నటి వరకు రుసరుసలు.. నేడు చంద్రబాబు దీక్షకు మద్ధతు, కేశినేని నాని అలక వీడారా.. ?
ఇప్పటికే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా, విజయవాడ పశ్చిమలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కేశినేని నాని రావడంతో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాకు.. ఎంపీ కేశినేని నానికి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ఘోర పరాజయానికి కారణమైంది. ఈ క్రమంలో ఎంపీ కేశినేనికి కీలక పదవి అప్పగించడం.. టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని స్థానిక కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
