విజయవాడ: పేదలకు తక్కువ ధరకు భోజనం అందించే అన్న క్యాంటీన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఆయన వాటిని ప్రారంభించి, భోజనాలను అందించారు.  

అందరితో కలిసి ఆయన భోజనం చేశారు. ఆయనతో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ క్యాంటీన్లలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తారు. పేదలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్యాంటీన్ ద్వారా రోజుకు 300 మందికి పౌష్టికాహారం అందిస్తారు. తొలి విడతలో 25 మున్సిపాలిటీల్లో 60 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు.