Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు మధ్యంతర బెయిల్ : రాజమండ్రికి బయలుదేరిన అచ్చెన్నాయుడు..

చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాజమండ్రికి బయలుదేరారు. చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. 

Chandrababu Interim Bail : Atchennaidu left for Rajahmundry - bsb
Author
First Published Oct 31, 2023, 12:43 PM IST

అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఊరట లభించింది.  గత 53 రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర భైలును మంజూరు చేసింది. అయితే అంతకుముందే చంద్రబాబు నాయుడుతో మంగళవారం మూలకాతయేందుకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చం నాయుడు,  టిడిపి నేతలు ఏలూరి సాంబశివరావు, సత్య ప్రసాద్ లు  అమరావతి నుంచి బయలుదేరి రాజమండ్రి కి వెళుతున్నారు.

మధ్యంతర బెయిల్ విషయం తెలియడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రతి జిల్లా నుంచి టీడీపీ నేతలు రాజమహేంద్రవరానికి బయలుదేరారు.  చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈరోజు సాయంత్రం బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనను భారీ ర్యాలీతో రాజమండ్రి నుంచి అమరావతికి తీసుకురానున్నారు. అయితే రాజమండ్రి నుంచి నేరుగా విజయవాడకు చంద్రబాబు వెళ్తారని టిడిపి అదిష్టానం తెలిపింది. అయితే, చంద్రబాబును ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్లనున్నట్టు సమాచారం. చంద్రబాబు బెయిల్ నేపథ్యంలో ఎన్ ఎస్జీ, పోలీసులు జైలు దగ్గరికి చేరుకుంటారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios