విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి గన్నవరం విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబును అధికారులు ఓ సామాన్య ప్రయాణికుడిలా పరిగణించారు. 

విఐపి, జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ఆయనను సాధారణ ప్రయాణికుడిలా పరిగణించి తనిఖీలు కూడా చేశారు. చంద్రబాబు వాహనాలను లోనికి అనుమతించంలేదు. 

ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు వెళ్లడానికి ప్రత్యేక వాహనాన్ని ఆయన కోసం కేటాయించలేదు. ప్రయాణికుల వాహనంలోనే ఆయన ప్రయాణించాల్సి వచ్చింది. చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాాబాదు చేరుకున్నారు.

చంద్రబాబు పట్ల అధికారులు వ్యవహరించిన తీరును తెలుగుదేశం పార్టీ వర్గాలు తప్పు పడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబుకు కాన్వాయ్ కి పైలట్ క్లియరెన్స్ తొలగించారు.