ఏపీలోని పోలీస్‌ స్టేషన్ల సమూల మార్పులు కార్పోరేట్ స్థాయిలోకి  పోలీస్‌ స్టేషన్‌ అధునీకరణ కుప్పంలో ఆదర్శ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు



పోలీసులు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఖాకీ చొక్కా, చేతిలో లాఠీ. మరి పోలీస్ స్టేషన్లంటే అవే పాత బంగళాలు,ఇరుకు గధులు. ఇలాంటి పోలీసులు, పోలీస్‌ స్టేషన్లను సమూలంగా మార్చేసే పనిలో పడింది ఏపీ సర్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 700 వందల పోలీస్ స్టేషన్లను ఆదర్శ పోలీస్ స్టేషన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది ప్రభుత్వం.


అందులో భాగంగా ఆదర్శ పోలీస్‌ స్టేషన్లను అబివృద్ది చేసే పనిలో పడింది పోలీస్ శాఖ. అందులో పోలీసుల వేషదారణ కార్పోరేట్ స్థాయిలో ఉండనుంది. అంటే ఖాకీ దుస్తులు కాకుండా ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ లో కనిపిస్తారు. నల్ల ప్యాంట్‌, లేత నీలం రంగు ఫుల్‌ షర్ట్‌లు ధరించి కార్పోరేట్ ఉద్యోగిలా ఉంటారు. వీళ్లను ఆదర్శ పోలీసులుగా నామకరణం చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.


ఏపీలో ఇలాంటి పోలీస్‌ స్టేషన్‌ను మొదట గుంటూరులో ఏర్పాటు చేసారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మరో ఆదర్శపోలీస్ ‌స్టేషన్‌ను ప్రారంభించారు.రాష్ట్రంలోని అన్ని పోలిస్టేషన్లను ఆదర్శపోలీస్ స్టేషన్లుగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు.


 పోలీస్‌ స్టేషన్‌ మొత్తం అద్దాల గదులు, ఏసీలు, ఆధునిక సాంకేతిక పరికరాలతో కనిపిస్తుంది. సీసీ కెమెరాలన్నీ ఈ స్టేషన్‌లోని కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానమై ఉంటాయి. ఇక్కడ నమోదయ్యే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇక్కడ జరిగే ప్రతి విశయాన్ని డీజీపీ స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా ఏర్పాటు చేసారు.