Asianet News TeluguAsianet News Telugu

ఎపి నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Chandrababu govt announces unemployment allowance

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. నెలకు రూ. వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు మంత్రి వర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులకు భృతిని అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఒక కుటుంబంలో ఇద్దరికి భృతిని ఇస్తామని ప్రకటించారు. భృతిని అందుకోవడానికి కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలని తెలిపారు.

దారిద్ర్య రేఖకు రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే భృతి పథకం వర్తిస్తుందని లోకేష్ చెప్పారు. పథకం విధివిధానాలపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజల్లో చర్చ జరిగిన అనంతరం ఏవైనా మార్పులు ఉంటే చేస్తామని చెప్పారు. పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో సుమారు 10లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం ఏటా రూ.1200 కోట్లు ఖర్చవుతుందన్నారు. మన దేశంలో కూడా 10 రాష్ట్రాల్లో ఈ నిరుద్యోగ భృతి చెల్లించే కార్యక్రమం చేపట్టి విఫలమయ్యారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రెండేళ్లలోనే నిలిపేస్తే.. కొందరు ఆర్నెళ్లలోనే ఆపేశారని చెప్పారు. 

విధివిధానాల్లో  ప్రధానమైనవి ఇవీ...

-  దరఖాస్తు చేసుకొనేవారు బీపీఎల్‌ కుటుంబానికి చెందినవారై ఉండాలి, తెల్ల రేషన్‌ కార్డు కల్గి ఉండాలి. 
- 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగినవారే అర్హులు. 
- డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉండాలి 
- ఒక కుటుంబంలో ఇంతమంది అని పరిమితిలేదు.
-  బయోమెట్రిక్‌ పద్ధతి ద్వారా నేరుగా - బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమచేస్తారు
- నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో వారిని భాగస్వాముల్ని చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios