Chandrababu: చంద్రబాబుకు బెయిల్ ..కండిషన్స్ ఇవే !! 

Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ మేరకు పలు కండిషన్స్ పెట్టింది.

Chandrababu gets bail these are the conditions KRJ

Chandrababu: స్కిల్ స్కాం కేసులో  టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో గత 53 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్ కోరగా.. విచారించిన హైకోర్టు 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో ఎట్టకేలకు చంద్రబాబు జైలు నుండి బ‌య‌ట‌కు రానున్నారు. అయితే.. బెయిల్‌ మంజూరు సమయంలో హైకోర్టు చంద్రబాబుకు ఐదు కండీషన్లు పెట్టింది. 

షరతులు:-

1) పిటిషనర్ చంద్రబాబు లక్ష రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు ట్రయల్ కోర్టు ఎదుట సమర్పించాలని ఆదేశించింది.

2) చంద్రబాబు తన ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు. 

3) చంద్రబాబు ఏ ఆస్పత్రిలో చిక్సిత పొందారో.. ఆయనకు ఏ చిక్సిత అందించారో పూర్తి  వివరాలను సీల్డ్ కవర్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కి లొంగిపోయే సమయంలో అందజేయాలి. 

4) పిటిషనర్ చంద్రబాబు ప్రత్యక్షంగానీ లేదా పరోక్షంగానీ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తితో మాట్లాడకుండదు. వారిని ఎటువంటి ప్రేరేపణ, బెదిరింపు చేయకూడదు. రాజకీయ సమావేశాల్లో కానీ, నేతలతో భేటీలో కానీ పాల్గొనవద్దని తెలిపింది

5)చికిత్స అనంత‌రం నవంబ‌ర్  28, 2023న సాయంత్రం 5 గంటలలోపు చంద్రబాబు తనంతట తాను రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.  

కాగా.. చంద్రబాబు విడుదలకు సంబంధించిన డ్యాకుమెంటరీ వర్క్ వర్క్ అంతా ఈ రోజు  మధ్యాహ్నాం పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని సక్రమంగా సాగుతే.. చంద్రబాబు  ఇవాళ‌ సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios