పరిటాల కుటుంబానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పదవి కట్టబెట్టారు. మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటకు చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.  రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబానికే కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అయితదే ఇందులో పరిటాల  సునీత, పరిటాల శ్రీరామ్ ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో వారి నిర్ణయానికే వదిలేస్తున్నానని అన్నారు.

పరిటాల సునీత కుటుంబ సభ్యులతో చర్చించి ఎవరు ఎక్కడ ఇన్‌చార్జిగా ఉండాలో తెలియజేస్తామని చెప్పడంతో ధర్మవరానికి వారిరువురిలో ఎవరు బాధ్యత వహిస్తారన్నది తెలియాల్సి ఉంది.అనంతరం  పరిటాల సునీత మాట్లాడుతూ ఓ నాయకుడు ఇదే ధర్మవరంలో తాము మాట్లాడటానికి కూడా అవకాశమివ్వలేదని, అదే వ్యక్తి పార్టీని వీడి వెళ్లాడన్నారు. అయితే కొందరు వస్తుంటారు, పోతుంటారని, వారి గురించి పట్టించుకోనవసరం లేదన్నా రు. చంద్రన్న మాటే శిరోధార్యమన్నారు. మా కుటుం బ సభ్యులందరితోనూ చర్చించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఇన్‌చార్జిగా ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుంటామని ఆమె పేర్కొన్నారు.