అన్ని వర్గాలకు ప్రయోజం చేకూరేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మిషన్ ఎలక్షన్-2019లో భాగంగా ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అన్ని వర్గాలకు ప్రయోజం చేకూరేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మిషన్ ఎలక్షన్-2019లో భాగంగా ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఎన్ని ఆర్ధిక కష్టాలున్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సమాజంలో ఎవరినీ నిరాదరణకు గురికానివ్వమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే విపక్షాలకు మమతా బెనర్జీ మూలస్తంభం లాంటివారని చంద్రబాబు కొనియాడారు.

మమత ఎపిసోడ్ విషయంలో కేసీఆర్, జగన్ మౌనంపై చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ ఘటనతో కేసీఆర్, జగన్‌లు మోడీ మనుషులేనని విషయం స్పష్టమైంది. ఇద్దరూ మోడీ కనుసన్నుల్లో ఉన్నారన్నది సుస్పష్టమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వారిద్దరూ ప్రధానికి ఊడిగం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.