అమరావతి: ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఇంటికి పోతారనే భయంతోనే జగన్ సర్కార్ ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

బుధవారం నాడు బోగి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా పరిటాలలో  బోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఐదు జీవోలను బోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పోలీసులు,  కలెక్టర్ల పై ప్రభుత్వానికి నమ్మకం లేదా ఎందుకు ఎన్నికల పెట్టరో  సమాధానం చెప్పాలన్నారు.ఎలక్షన్ కమిషన్ ఒక్కటే ఎన్నికలు జరపదని ఆయన గుర్తు చేశారు. పోలీసులతో పాటు అధికారులు కలిసే ఎన్నికల నిర్వహిస్తారు.

 ఎక్కడ తప్పు జరుగకుండా చూసే బాధ్యత తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల ఎప్పుడూ పెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇంటికి పోవడం ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. .

సంక్రాంతి అంటే రైతులపండుగ నేడు రైతుల పరిస్తితి కళావిహీనమైందన్నారు. అందుకే రైతు వ్యతిరేక జీ వో లను భోగిమంటలలో వేసి  తగులబెట్టానని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం లో ఏడు సార్లు వరదలు వస్తె ఒక్కసారి కూడా రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదని  ఆయన విమర్శించారు. 

పెన్షను 3000 వేలు ఇస్తానని ప్రజలను మభ్యపెట్టాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని చంద్రబాబు హెచ్చరించారు. ఎ.పి లో ఎక్కడా చూడని జగన్ బ్రాండ్ లిక్కర్ అమ్ము తున్నాడన్నారు.

అమ్మ ఒడి, నాన్న బుడ్డి సంక్రాంతి కోడి కత్తి కేసు ఏమైందని ఆయన ప్రశ్నించారు. బాబాయి హత్య మొదట గుండెనొప్పి అన్నారు,తరువాత హత్య అన్నారు ఏది నిజమో చెప్పాలన్నారు. విద్వంసం తోనే జగన్ పాలన మొదలయ్యిందన్నారు.

ప్రజా వేదిక కూల్చి అది తిసివేయకుండా నన్ను బాధపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడన్నారు.మీ మంత్రులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు.మీ ఎమ్ .ఎల్.ఎ లు మట్టి ఇసుక భుకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

డబ్బే ద్యేయంగా ఎంత నీచానికైనా పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతి రైతులు ఏం అన్యాయం చేశారు?అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటాని ఆరోపించిన వైసీపీ నేతలు దర్యాప్తులో ఏం తేల్చారో చెప్పాలని ఆయన కోరారు. పొలాలు కొనుక్కొని అమ్ముకుంటే తనకు ఏమీ సంబంధమన్నారు.