Asianet News TeluguAsianet News Telugu

Chandrababu Arrest: దీక్షా శిబిరంలోనే కుప్పకూలి మహిళా నేత మృతి.. కొన‌సాగుతున్న టీడీపీ నిర‌స‌న‌లు

Skill Development Case: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ ముగిసింది. వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించారు. ఇదిలావుండ‌గా, చంద్ర‌బాబు నాయుడు అరెస్టు క్ర‌మంలో టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌ల మ‌ధ్య  దీక్షా శిబిరంలోనే కుప్పకూలి మహిళా నేత మృతి చెందారు. 
 

Chandrababu Arrest: TDP Woman leader dies after collapsing in protest camp RMA
Author
First Published Sep 20, 2023, 7:48 PM IST

Chandrababu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ ముగిసింది. వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించారు. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనీ, బలమైన సాక్ష్యాధారాల ఆధారంగానే చంద్రబాబును అరెస్టు చేశారని పేర్కొన్నారు. రికవరీపై మాత్రమే దృష్టి పెట్టకుండా కుట్ర కోణాన్ని వెలికి తీయడానికి మరింత దర్యాప్తు అవసరమని సుధాకర్ రెడ్డి వాదించారు. 

ఇదిలావుండ‌గా, చంద్ర‌బాబు నాయుడు అరెస్టు క్ర‌మంలో టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌ల మ‌ధ్య  దీక్షా శిబిరంలోనే కుప్పకూలి మహిళా నేత మృతి చెందారు. చంద్రబాబును అరెస్టు చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ శ్రేణులు సైతం చంద్ర‌బాబును విడుదల చేయాలంటూ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాకినాడలో నిర్వహిస్తున్న తెలుగు దేశం పార్టీ దీక్షా శిబిరంలో మాట్లాడుతూ కుప్పకూలిన టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి ప్రాణాలు కోల్పోయారు. దీక్ష శిబిరంలో కుప్ప‌కూలిన వెంట‌నే ఆమెను స్థానికంగా ఉన్న జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఆమె కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నార‌ని స‌మాచారం.

చంద్ర‌బాబు అరెస్టు నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆందోళ‌న‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వస్తున్న తెగులుదేశం పార్టీ.. త్వ‌ర‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రజా ఉద్యమం చేప‌డ‌తామ‌ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్‌లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయ‌న‌ ఆధ్వర్యంలో నిరసన కొన‌సాగిస్తూ.. చంద్ర‌బాబు అరెస్టు ఖండించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రజానీకం సైకో పాలనతో విసిగిపోయార‌ని విమ‌ర్శించారు. ఇక నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గం ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొన‌సాగించారు. సీపీఐ శ్రేణులు సైతం కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుని సంఘీభావం ప్ర‌క‌టించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios