చంద్రబాబు అరెస్ట్ : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు... తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు...
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.

విజయవాడ : నంద్యాలలో శనివారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మంగళగిరి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సుల కోసం వచ్చిన ప్రయాణికులు, విధ్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు ను అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జిల్లా అంతటా హై అలర్ట్ నెలకొంది. జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో భారీగా పోలీస్ పహారా పెట్టారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా టిడిపి ముఖ్య నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో బస్సులు ఆర్టీసి డిపోలకే పరిమితమయ్యాయి.
చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదు.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా చేర్చారు.. లాయర్లు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ కు నిరసన గా గన్నవరంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో భారీగా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా టిడిపి ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
జిల్లాలో బస్సు సర్వీసులను రద్దు చేయడంతో బస్సులు ఆర్టీసి డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ ఎత్తున పోలీసులు చేరుకుని బస్సులన్నింటినీ బస్టాండ్ లోనే ఆపేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చూస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి కూడా పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. బస్సులన్నింటినీ బస్టాండ్ లోనే ఆపేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా చూస్తున్నారు.
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చు అన్నారు.
కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చింది? అని ప్రశ్నించారు. లోకేష్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలను నిర్బంధించటం దుర్మార్గం అన్నారు. మార్గదర్శిపై సిఐడి దుందుడుకుగా వ్యవహరిస్తోందన్నారు. జగన్ సర్కార్ ప్రతిపక్షాలను వేధించటానికి ఇది పరాకాష్ట అన్నారు రామకృష్ణ.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును టిడిపి నేత వెనిగండ్ల రాము ఖండించారు. తన నివాసంలోనే వెనిగండ్ల రాము శాంతియుతంగా నిరాహార దీక్షకు దిగారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంత పాలనలో ఉన్నామా? అని ఆవేదన వ్యక్తం చేశారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఈ విధంగా మానసిక ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి గడియలు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి చంద్రబాబుపై ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నారు. 2024 తర్వాత వైసిపి నాయకులు అందరూ జైల్లో ఊసలు లెక్కపెట్టడం ఖాయం అన్నారు. చంద్రబాబు శాంతియుతంగా ఉండాలని చెప్పడంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం అని రాము అన్నారు.