నీచుడు చంద్రబాబును జైలుకు పంపావు... థ్యాంక్యూ జగన్..: జూ.ఎన్టీఆర్ ప్లెక్సీల కలకలం (వీడియో)
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయించినందుకు సఎం వైఎస్ జగన్ కు సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు హరికృష్ణ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా జగ్గయ్యపేటలో ప్లెక్సీలు వెలిసాయి.

జగ్గయ్యపేట : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అరెస్ట్ కు నిరసనగా టిడిపి శ్రేణులు ఆందోళనలు చేపడుతుంటే, వైసిపి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.చంద్రబాబు అరెస్ట్ నందమూరి కుటుంబాన్ని సంతోషపెడుతుందని వైసిపి నాయకులు అంటున్నారు. ఇలా జూ, ఎన్టీఆర్, హరికృష్ణ సీఎం జగన్ కు థ్యాంక్స్ చెబుతున్నట్లు జగ్గయ్యపేటలో వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
''థ్యాంక్యూ జగన్... నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నన్ను చివరిదశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక కూడా ఆ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకున్నాడు.నా కుమారుడు హరికృష్ణ, మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడుకున్నాడు. ఇలా మా కుటుంబ మరణాలను వాడుకుని నీచ రాజకీయాలు చేసిన వీడికి బుద్దిచెప్పి నా ఆత్మకు శాంతి చేకూర్చావు. నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు జైలుకు వెళుతున్న సెప్టెంబర్ 10న ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని తెలుగు ప్రజలను కోరుతున్నా'' అంటూ సీనియర్ ఎన్టీఆర్ సంతకంతో ప్లెక్సీలు వెలిసాయి.
వీడియో
జగ్గయ్యపేటలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ఈ ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. సీనియర్ ఎన్టీఆర్ యూత్ అసోసియేషన్ పేరుతో వెలిసిన ఈ ప్లెక్సీలపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్, సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు హరికృష్ణ ఫోటోలు ఒకే ప్లెక్సీలో వుండటంతో జగ్గయ్యపేట ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Read More ఏపీ బంద్... టిడిపి శ్రేణుల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తత
ఇదిలావుంటే చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టిడిపి ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు, వ్యాపార సముదాలను టిడిపి శ్రేణులు మూసేయిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టిడిపి ముఖ్య నాయకులు ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసులు గృహనిర్భందం చేసారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ తో వైసిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మంత్రి రోజాతో పాటు మరికొందరు వైసిపి నేతలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకున్నారు. చంద్రబాబు అరెెస్ట్ తో ఇక టిడిపి పని అయిపోయినట్లేనని వైసిపి నాయకులు అంటున్నారు. చంద్రబాబుతో ఈ అరెస్టులు ఆగవని... నారా లోకేష్ తో మరికొందరు నాయకుల అరెస్టులు ఖాయమని వైసిపి నాయకులు అంటున్నారు.