Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ వర్థంతి.. స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు కూడా హరికృష్ణకు నివాళులర్పించారు.

Chandrababu and lokesh Remember Great Soul nandamuri Hari krishna over his death anniversary
Author
Hyderabad, First Published Aug 29, 2020, 12:22 PM IST

సినీ నటుడు, ఎన్టీఆర్ చైతన్య రథసారధి నందమూరి హరికృష్ణ రెండో వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు కూడా హరికృష్ణకు నివాళులర్పించారు.

ట్విట్టర్ వేదికగా హరికృష్ణను స్మరించుకున్నారు. ‘నందమూరి హరికృష్ణ అంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం అన్నారు చంద్రబాబు. హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

‘చైత‌న్య ర‌థ‌సార‌ధి, న‌ట‌న‌లో రాజ‌సం, ముక్కుసూటి వ్య‌క్తిత్వంతో అంద‌రి అభిమానం చూర‌గొన్న హ‌రి మావ‌య్య మాకు దూర‌మై నేటికి రెండేళ్ల‌వుతోంది. రెండ‌వ వ‌ర్థంతి సంద‌ర్భంగా హ‌రిమావ‌య్య స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఇక హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా ట్విట్టర్ వేదికగా తన తండ్రిని స్మరించుకున్నారు. ‘నాన్న మనకి దూరం అయ్యి 2 సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మశక్యంగా లేదు.. ఆయన నమ్మిన సిద్దాంతాన్ని ఆయన తుది శ్వాస వరకు విడనాడలేదు.. కుటుంబ సభ్యులతో ఎంత ప్రేమగా ఉంటారో నందమూరి కుటుంబ అభిమానులను కూడా అంతే సొంత కుటుంబంలా భావించేవారు.. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది అయినా.. ఆయన మనలో నింపిన ధైర్యంతో ముందుకు సాగుదాం’అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. హరికృష్ణ మరణం తర్వాత తెలంగాణ ఎన్నికల్లో సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. పలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో సైతం ఆయన వర్థంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆందన బాబు మాట్లాడతూ.. పార్టీ బలోపేతం కోసం హరికృష్ణ ఎనలేని సేవలు అందించారన్నారు. హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటన్నారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నక్కా ఆనందబాబు, శ్రీ బోండా ఉమా మాహేశ్వరరావు, శ్రీ దారపనేని నరేంద్ర, శ్రీమతి వేగంట రాణి, శ్రీ వల్లూరి కుమార స్వామి, శ్రీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios