కూతుర్ని చంపిన తండ్రి: కారణం ఇదే

chandarlapadu murder case
Highlights

కూతుర్ని చంపిన తండ్రి: కారణం ఇదే 

కృష్ణాజిల్లా చందర్లపాడులో కూతుర్ని కొట్టి చంపిన ఘటనలో పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో హత్య గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత కూతురు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానంతో తండ్రి కోటయ్య ఆమెను చంపాడని భావించారు. అయితే తాజాగా కుమార్తె ప్రేమ వ్యవహారం కోటయ్యకు తెలియడం.. ఎంత చెప్పినా ఆమె వినకపోవడం వల్లే అతను హత్య చేయాల్సి వచ్చినట్లు పోలీసులు నిర్థారించారు.

మృతురాలు చంద్రిక గత కొంతకాలంగా గోపి మనోహర్ అనే వ్యక్తిని ప్రేమిస్తోందని.. ఈ విషయం తండ్రికి తెలియడం.. ఆమె గోపినే పెళ్లి చేసుకుంటానని కోటయ్యతో తరచూ వాగ్వివాదానికి దిగేదని... ఈ క్రమంలో తన మాట వినడం లేదన్న కోపంతోనే కొట్టి చంపాడని పోలీసులు తేల్చారు. కాగా, చంద్రిక మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పరారీలో ఉన్న తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. 

loader