విశాఖపట్నం: సినీహీరోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. తమిళ సినీరంగం జల్లికట్టుకోసం ముందుకొచ్చి పోరాడి సాధించిందని చలసాని గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకై ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో చేపట్టిన సమరయాత్రలో పాల్గొన్న ఆయన ఏపీకి అన్యాయం జరుగుతున్నాసినీ హీరోలు  కానీ, సినీ రంగ ప్రముఖులు కానీ ముందుకు రావడం లేదని విమర్శించారు.  

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపైనా చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. నాలుగేళ్లు పోరాటం చేయకుండా ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. హోదా సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా సమరయాత్ర నిర్వహిస్తున్నామని ప్రజలు తమకు మద్దతు ప్రకటించాలని కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నాలుగేళ్ల క్రితమే పోరాటం చేస్తే హోదా వచ్చేది: బాబుపై ఆర్ నారాయణ మూర్తి సెటైర్