అమరావతి: కౌంటింగ్ పూర్తైన తర్వాత రీ పోలింగ్ అనేది సాధ్యం కాదని ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి రాలేదన్నారు. కానీ తాను కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు రాశారని చెప్పుకొచ్చారు. తానుచెప్పింది పూర్తిగా రాయాలని అంతేకానీ కట్ చేసి రాయోద్దన్నారు. 

కొన్ని వార్తలను చూస్తుంటే తాను తప్పుడు సమాచారం చేరవేసేలా వార్తలు వస్తున్నాయని అవిబాధాకరమన్నారు. ఆ వార్తలు అందర్నీ గందరగోళానికి గురి చేస్తున్నాయని అందువల్ల తాను చెప్పింది చెప్పినట్లు రాయాలని మీడియాను కోరారు. 

ఈవీఎంలు హ్యాక్ అయిపోతున్నాయని, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏదో జరిగిపోతుందంటూ వస్తున్న వార్తలను నమ్మెుద్దు అని చెప్పుకొచ్చారు. ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయో తనకు తెలియడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. 

పోస్టల్ బ్యాలెట్ల కంటే సర్వీస్ ఓట్లు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గురువారం ఉదయం నుంచి జరగబోతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ కు చేరే సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు సిఈవో గోపాలకృష్ణ ద్వివేది.