శ్రీశైలం ప్రాజెక్టు: పరిశీలించిన సెంట్రల్ వాటర్ కమిషన్
శ్రీశైలం ప్రాజెక్టును గురువారంనాడు సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు గురువారంనాడు పరిశీలించారు.
శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టును గురువారంనాడు సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు పరిశీలించారు. శ్రీశైలం డ్యామ్ భద్రత, నీటి నిల్వ వినియోగం, గ్యాలరీ విభాగం పనితీరును పరిశీలించారు. వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఉధృతంగా వరద వస్తే తట్టుకునే శక్తిపై సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఆరా తీశారు.
శ్రీశైలం డ్యామ్ భద్రతపై గతంలోనే పాండ్యా కమిటీ ఓనివేదికను ఇచ్చింది. కొత్తగా మరో స్పిల్ వే నిర్మించడం లేదా డ్యామ్ ఎత్తు పెంపు వంటి విషయమై ఈ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.2020 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం మాజీ చైర్మెన్ పాండ్యా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
also read:తప్పిన ప్రమాదం: శ్రీశైలం డ్యామ్‌పై విద్యుత్ షార్ట్ సర్క్యూట్, మంటలు
శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే సామర్ధ్యం 13. 20 లక్షల క్యూసెక్కులు. అయితే 2009లో కృష్ణానదికి భారీగా వరదలు వచ్చాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ వద్ద పడిన భారీ గుంత కారణంగా ప్రాజెక్టుకు ముప్పు అని కూడ నిపుణులు హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రత విషయంలో పాండ్యా కమిటీ ప్రత్యామ్నాయాలను సూచించింది. భారీ వరద నీరు వస్తే ఏం చేయాలనే దానిపై ఆ నివేదికలో సమగ్రంగా వివరించింది.