ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం పార్లమెంట్‌లో కేంద్రం కీలక విషయాలను వెల్లడించింది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తికాలేదని పేర్కొంది. పోలవరం నిర్మాణ గడువును మరోసారి పొడిగించింది. 

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం పార్లమెంట్‌లో కేంద్రం కీలక విషయాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తికాలేదని పేర్కొంది. పోలవరం నిర్మాణ గడువును మరోసారి పొడిగించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి Bishweswar Tudu లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సిన ఉన్న పూర్తికాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే జాప్యం అవుతోందని తెలిపారు. 

ఇప్పటివరకు హెడ్ వర్క్స్ 77 శాతం, కుడి కాలువ పనులు 93 శాతం, పోలవరం ఎడమ కాలువ పనులు 72 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 నవంబర్‌లో ఒక కమిటీని నియమించిందని తెలిపారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. 2022లో నివేదిక ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం గడువును 2024 జూన్ వరకు పొడిగించాలని కమిటీ సూచించిందని తెలిపారు.

ఇదిలా ఉంటే.. గత నెలలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అన్నారు. డయాఫ్రమ్ వాల్‌కు జరిగిన నష్టానికి నిపుణులు ఇంకా పరిష్కారాలను కనుగొనలేదని చెప్పారు. ‘‘మే 22న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన 12 మంది సభ్యుల నిపుణుల బృందం ప్రాజెక్ట్ సైట్‌లోని డయాఫ్రమ్ వాల్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. డయాఫ్రమ్ వాల్‌కు జరిగిన నష్టానికి నిపుణులు ఇంకా ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేదు. డయాఫ్రమ్ వాల్ పాక్షికంగా లేదా పూర్తిగా పాడైపోయిందా అనే విషయం తెలియలేదు. డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తు చేయాలా లేక మళ్లీ నిర్మించాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు’’ అని అంబటి రాంబాబు అన్నారు.

‘‘పోలవరం ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇప్పటి వరకు మాకు ఎలాంటి గడువు లేదు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిపుణుల సిఫార్సుల కోసం మేము ఎదురుచూస్తున్నాము. అయితే 2024లోపు మొదటి దశను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం’’ అని మంత్రి చెప్పారు.